తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి రుయా, స్విమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు జగన్. పద్మావతి మెడికల్ కాలేజీకి చేరుకొని తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించారు.
మరో వైపు వై.ఎస్. జగన్ తిరుపతిలో బాధితుల పరామర్శకు వస్తున్నారని ప్రభుత్వం కుట్ర చేసిందని వైసీపీ ఆరోపించింది. జగన్ వాహనానికి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేదని విమర్శించారు. ఆ తరువాత జగన్ రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లారని ఓ వీడియో ను పోస్ట్ చేసింది. కొద్దిదూరం నడిచిన తరువాత స్థానిక వైసీపీ నేత వాహనంలో జగన్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వెల్లారని వైసీపీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.