సీనియర్ లెజిస్టేటివ్ మెంబర్ ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) మాట్లాడాక జగన్ మాట్లాడడానికి ఏం ఉండదు అని అనుకుంటే ఆయన మాత్రం మళ్లీ తన రణ తంత్రం వినిపించారు. ఎత్తర జెండా నెత్తురు మరిగితే అన్న విధంగానే ఆయన తన పార్టీ జెండాను మళ్లీ ఎత్తుకునేందుకు భుజాలకు ఎత్తుకుని ఊరేగించేందుకు తాను అనుకున్న ఉద్వేగ సంబంధ నిర్ణయాలను మరోసారి వెలువరించి స్పష్టత ఇచ్చి మళ్లీ తన మాటకు ఎదురులేదని నిరూపించుకున్నారు.
ఆ విధంగా జగన్ మాట రణం జగన్ తీరు రౌద్రం కొన్నింట.. రుధిరం అనే మాటకు ఇక్కడ తావు లేదు కానీ రాజధాని వాకిట జరిగిన పోరాటంకు ఓ అర్థంలో రుధిరం (రక్తం) చిందిన యుద్ధం అని వాడుకోవచ్చు. కానీ ఇక్కడ రక్తం చిందలేదు కానీ యుద్ధం మాత్రం జరిగింది. రక్తం మరిగేలా కొన్ని మాటలు ఉన్నాయి అవి టీడీపీని ఉద్దేశించి అన్నారు కనుక ఆ విధంగా రణం..రౌద్రం అన్నీ నిన్నటి వేళ కనిపించాయి.
చాలా రోజులకు జగన్ గెలిచాడు. చాలా రోజులకు తన మాట నెగ్గించుకునేందుకు ఎంతో తపన పడి చివరికి విజయం ఖాయం చేసుకున్నారు. ఈ దెబ్బకు ధర్మానకు మంత్రి పదవి ఖాయం. ఈ దెబ్బకు మంత్రి వర్గంలో మార్పులు కూడా ఖాయం. తెలివిగా చెప్పి తప్పించుకున్నాడు. తానేం చేస్తానో చెప్పలేదు కానీ ఇది వరకు ఏం జరిగిందో చెప్పి హాయిగా తప్పుకున్నాడు.ఆ విధంగా జగన్ చాలా రోజులకు తన గెలుపు బావుటా ఎగురవేశారు.
ఇంతకాలం పసుపు మరియు పచ్చ జెండాలు మాత్రమే మాట్లాడుతున్నాయి. అంటే వైసీపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు వైసీపీ రూపొందించుకున్న మూడు రంగుల జెండాలో పచ్చ రంగు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది.. తెలుపు రంగు కూడా మాట్లాడి శాంతి వచనాలు వినిపిస్తే ఎలా ఉంటుంది అనేందుకు ఉదాహరణ తాజా చిత్రం. తాజా పరిణామం కూడా.. జెండాలో నీలం రంగు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది అని పలికేందుకు తార్కాణం ఈ చిత్రం అనగా అసెంబ్లీ చిత్రం.
రాజధానికి వ్యతిరేకం కాదు. అమరావతి అనే రాజధాని నిర్మాణంకు వ్యతిరేకం కాదు కానీ 3 రాజధానులే మా సిద్ధాంతం అని చెప్పారు. ఆఖరులో ఆత్మ గౌరవ నినాదం అంటే టీడీపీ వ్యవస్థాపకులు వినిపించిన ఎన్టీఆర్ నినాదం వినిపించారు. అభివృద్ధికీ ఆత్మ గౌరవానికీ మధ్య తాను వారధిగా ఉంటానని జగన్ అన్నారు. ఓ విధంగా టీడీపీకి ఝలక్ ఇచ్చారు. కోర్టుకు నీతులు చెప్పారు. కోర్టు చెప్పినవన్నీ చేసేందుకు తాము లేమని మళ్లీ మళ్లీ నాటి తీర్పును నిన్నటి అసెంబ్లీలో సవాలు చేశారు. అంటే డెడ్ లైన్, టైం బౌండ్ అన్నవి తమకు పట్టవని కూడా అన్నారు. వీలున్నంత మేరకు రాజధాని రైతుకు సాయం చేస్తామని చెప్పి ఓ కొత్త వాదానికి తెర లేపారు.