రేషన్ కార్డు వుందా..? అయితే మీకో గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్ ని చెప్పింది. కేంద్రం అందించే ఈ రేషన్ కార్డు వలన ఎన్నో లాభాలు వున్నాయి. రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు మాదిరిగా చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి.

ration-cards

ఈ కార్డు ఉంటే చౌక ధరలకే రేషన్ షాపుల నుంచి కిరాణ సరుకులు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారి సౌలభ్యం కోసం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ కూడా దీనిలో భాగమే. దీని వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది. దీని వలన ఎక్కడ నుండైనా రేషన్ ని పొందొచ్చు.

ఈ ప్రయోజనాలు పొందాలని భావించే వారు కచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఇది ఇలా ఉంటే తాజాగా రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఊరట కలిగే ప్రకటన చేసింది. మరి ఇక దాని కోసం చూస్తే.. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు అనుసంధానానికి గడువు పొడిగించింది కేంద్రం. దీనితో రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఉపశమనం లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానికి 2022 జూన్ 30 వరకు గడువు పొడిగించింది. ఇది వరకు ఈ గడువు 2022 మార్చి 31గా ఉంది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకే ఇబ్బంది ఉండదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version