అభిమానానికి హద్దుల్లేవ్.. తారక్ మాదిరిగా కొమురం భీం గెటప్‌లో గోచితో ఫ్యాన్ ఫ్లెక్సీ..

-

సినీ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతాన చిత్ర హీరోలను ప్రజలు దేవుళ్ల మాదిరిగా అభిమానిస్తుంటారు. వారికి పూజలు చేస్తుంటారు. ఇక తమ అభిమాన హీరో రిలీజ్ కాబోతుందంటే చాలు.. ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండబోదు. అటువంటిది ఇద్దరు సూపర్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు చూస్తే మతిపోతుంది.

tarak fan getup pooster

హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులిద్దరూ ఎవరికి వారు సెపరేట్‌గా బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. టాకీసుల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. బ్యానర్లకు కొన్ని చోట్ల అభిమానులు పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు వినూత్నంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట తెగ వైరలవుతోంది.

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గోచి లుక్‌లో ఏ విధంగా అయితే కనబడ్డాడో, అదే మాదిరిగా ఆయన అభిమాని సైతం గోచితో ఉన్న ఫొటోను బ్యానర్‌లో వేసుకున్నాడు. అలా ఆయన తన అభిమాన హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఫొటో వేసుకుని థియేటర్ వద్ద బ్యానర్ కట్టించాడు. అది చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా, అది చూసి మీమర్స్ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కొందరు ఈ అభిమాని నిజంగా తారకా? అని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోపై జోకులు కూడా వేస్తున్నారు. తారక్ మాదిరిగా అభిమాని గోచితో రెండు లేదా మూడు కిలోమీటర్లు పరిగెత్తాలని సరదాగా పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నెక్స్ట్ లెవల్‌లో ఉందని ఈ సందర్భంగా సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version