నిధుల్లేకే “జగనన్న వసతి దీవెన” వాయిదా వేశామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాల అమలుకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తాం…ఆర్థిక శాఖ సూచనల మేరకు వసతి దీవెనను వాయిదా వేశామని వివరించారు. విభజన సమస్యలపై కేంద్రంతో గతంలో చర్చలు జరిగాయని.. కొన్ని అంశాల్లో కొన్ని ఆర్డర్లు ఇచ్చాయని వివరించారు.
తెలంగాణ ఏపీకి ఇవ్వాల్సిన జెన్కో బకాయిలపై కేంద్రం ఆదేశాలిచ్చింది… దీనిపై తెలంగాణ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది.. అది వేకెట్ అయిందన్నారు. ఢిల్లీలో వివిధ అంశాలపై కొంత క్లారిటీ తేవడానికి ప్రయత్నించాం… మార్చి నెలాఖరులోగా వివిధ సమస్యల పరిష్కారం వస్తుందని భావించామని తెలిపారు. మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నాం.. కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతాం…ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో సీఎం కూడా హాజరు కావాల్సివ పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నారు. మా సూచన మేరకు సీఎం వ్యక్తిగత పర్యటన వేసుకున్నారు…మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది కాబట్టే ఈ సమాచారాన్ని తెలుపుతున్నామని పేర్కొన్నారు సీఎస్ జవహర్ రెడ్డి.