జగన్ దూకుడు…ఆ ఎంపీలకు కూడా సీటు డౌటే?

-

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..ఇంతకాలం ప్రభుత్వ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంటూ..ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పనిలో ఉన్న జగన్..ఇకపై ప్రభుత్వంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో దూకుడుగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే 175 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ దిశగానే ఎమ్మెల్యేలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎమ్మెల్యే…గడప గడపకు వెళ్ళి ప్రజల మద్ధతు పెంచుకోవాలని సూచించారు. అలాగే సరిగ్గా పనిచేసిన వారికే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇస్తానని కూడా తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం ఉండదని జగన్ చెప్పారు.

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఉండదు…ఇందులో ఎలాంటి డౌట్ లేదు…అయితే ఈ కండిషన్ ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు..ఎంపీలకు కూడా ఉంది. ఎమ్మెల్యేలు గెలవడం ఎంత ముఖ్యమో ఎంపీలు గెలవడం కూడా అంతే ముఖ్యం. ఎంపీ స్థానాల్లో బలమైన నాయకులు ఉంటే…ఎమ్మెల్యేల గెలుపుపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఈ సారి కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చేలా లేదు…కాబట్టి ఈ సారి ఎక్కువ ఎంపీలు గెలిస్తే వైసీపీకే అడ్వాంటేజ్ ఉంటుంది.

అందుకే జగన్ ఎంపీలపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది…సరిగ్గా పనిచేయని ఎంపీలని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశాలు ఇవ్వొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాల్లో కొత్త అభ్యర్ధులని పెట్టి జగన్ సక్సెస్ అయ్యారు…ఈ సారి కూడా కొన్ని మార్పులు చేసే ఛాన్స్ ఉంది. వాస్తవానికి వైసీపీలో చాలామంది ఎంపీలు హైలైట్ కాలేదని చెప్పొచ్చు…ఏదో అయిదారుగురు ఎంపీలు తప్ప…మిగిలిన వారు ప్రజలకు పెద్దగా తెలియడం లేదు. అలాగే పనితీరు విషయంలో కూడా కొందరు ఎంపీలు ఫెయిల్ అవుతున్నారు.

ఇక అలాంటి వారిని జగన్ పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. కచ్చితంగా ఎంపీ స్థానాల్లో పెద్ద మార్పు ఉంటుందని సమాచారం..మరి ఈ సారి ఎంపీ సీట్లు కోల్పోయేది ఎవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version