ఓటీటీపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం.. ఇంకా ఏం చెప్పిందంటే..?

-

తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది.

భారీ బడ్జెట్‌ చిత్రాలను 10 వారాల తర్వాతే ఓటీటీ కి ఇవ్వాలి. పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చు. రూ.6కోట్లలోపు బడ్జెట్‌ చిత్రాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవాలి.

సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్ ఫీజు) ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలి.

సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి-క్లాస్‌ సెంటర్లలో టికెట్‌ ధరలు రూ.100, రూ.70(జీఎస్టీతో కలిపి)గా ఉంచాలని ప్రతిపాదించారు. ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. మీడియం బడ్జెట్‌, మీడియం హీరో సినిమాలకు టికెట్‌ ధర నగరాలు/పట్టణాల్లో రూ.100 ప్లస్‌ జీఎస్టీ ఉండాలని, అదే సి-సెంటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉండాలని, మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.

పని పరిస్థితులు-ధరలు: నిర్మాతల నిర్ణయం, ఆలోచనల మేరకు ఛాంబర్‌, కౌన్సిల్‌ దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.

ఫైటర్స్‌ యూనియన్‌- ఫెడరేషన్‌ సమస్యలు: ఛాంబర్‌, కౌన్సిల్‌లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

మేనేజర్లు పాత్ర: నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ వ్యవస్థను రద్దు చేయాలి.

సమస్యలు: కచ్చితమైన సమయ పాలన అమలు చేయాలి. దీని వల్ల అదనపు రోజులు కాకుండా అనుకున్న సమయానికే షూటింగ్‌లు పూర్తవుతాయి. తమ సహాయకులకు వసతి, ఇతర సౌకర్యాలు కావాలని నటులెవరూ డిమాండ్‌ చేయటానికి వీల్లేదు. వాళ్ల పారితోషికం నుంచే సహాయకులకు చెల్లింపులు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version