ద్రౌపదికి జరిగిన అన్యాయమే.. చంద్రబాబుకు జరిగింది -జగ్గారెడ్డి ఫైర్

-

చంద్రబాబు కంట తడిపై కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌరవ సభ లో ద్రౌపదికి జరిగిన అన్యాయమే చంద్ర బాబుకు జరిగిందని జగన్ సర్కార్ పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాల నాయకులు కలిసి పని చేసే వాళ్ళమని.. ప్రతిపక్షం సమస్యలు లేవనెత్తిన.. హుందా తనం తో పని చేశారని చంద్రబాబు ను ప్రశంసించారు. చంద్ర బాబు నీ వైఎస్ ఓ సారి ఓ మాట అంటే… రికార్డ్ నుండి తొలగించండి అని వైఎస్ చెప్పారని.. జగన్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యే లు చంద్రబాబు మీద విమర్శలు చేయడం చూశా ? అని పేర్కొన్నారు.

మా గొంతు కెసిఆర్ నొక్కేస్తూ ఉన్నారు..కానీ పర్సనల్ దూషణలు ఇక్కడ లేవన్నారు. బాబు సీఎం గా ఉన్నప్పుడు … ఏపీ లో దూషణలు కూడా చూడలేదని పేర్కొన్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చాలా మంది నాయకులకు ఇబ్బందిగానే అనిపించిందని.. రాజకీయ కుట్రలు… కుతంత్రాలు ఉంటాయన్నారు. కానీ చంద్రబాబు కి వయసు రీత్యా అయినా..గౌరవం ఇవ్వాల్సిందని.. వ్యక్తిగత దూషణలు మంచిది కాదని సూచించారు. ఆంధ్ర రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలని… పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండన్నారు. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్ అని.. . ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version