సీఎల్పీ స‌మావేశాన్ని బైకాట్ చేసిన జ‌గ్గారెడ్డి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు సీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశం నుంచి జ‌గ్గా రెడ్డి బ‌య‌టకు వ‌చ్చారు. అంతే కాకుండా సీఎల్పీ స‌మావేశాన్ని బైకాట్ చేస్తున్న‌ట్టు కూడా ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ప్ర‌క‌టించారు. తన స‌మ‌స్య‌ల గురించి సీఎల్సీ స‌మావేశంలో చ‌ర్చించ‌డానికి వ‌చ్చాన‌ని జ‌గ్గా రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పెద్ద‌ల సూచ‌న మేర‌కు.. తాను సీఎల్పీ స‌మావేశంలో ఎలాంటి చ‌ర్చ చేయ‌డం లేద‌ని అన్నారు.

అలాగే ఈ స‌మావేశాన్ని తాను బై కాట్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. కాగ అసెంబ్లీ తాను కేసీఆర్ పై త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాన‌ని ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ప్రక‌టించారు. సీఎల్పీ స‌మావేశంలో త‌న‌కు జ‌రిగిన అన్యాయం పై మాట్లాడ‌న‌ని అన్నారు. సీఎల్పీ స‌మావేశంలో మాట్లాడ‌వ‌ద్ద‌ని సీఎల్పీ నేత భ‌ట్టీ విక్ర‌మార్క అన్నార‌ని తెలిపారు. అందుకే తాను సీఎల్పీ స‌మావేశాల‌ను బ‌హ‌ష్క‌రిస్తున్న‌ట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version