నేటి యువతీ యువకుల్లో టాటూలపై క్రేజ్ మాములుగా లేదు..ఫ్యాషన్ ప్రపంచంలో ఇవి ఒక ప్రత్యేకస్థానాన్ని ఆక్రమించాయి. సినీనటులు నుంచి మొదలు అందరికీ వీటిపై ఇష్టం ఉంటుంది. ఒక రకంగా జీవితాంతం మనిషితో ఉండే టాటూ…చనిపోయినప్పుడు మనతో తీసుకెళ్లగల ఏకైక ఆస్తిలా కూడా టాటూను భావించే వాళ్లు ఉన్నారు. అయితే. టాటూ అంటే..వివిధరకాల సింబల్స్ వేయించుకుంటారు., లేదా వారికి ఇష్టమైన వారి పేర్లను వేయించుకుంటారు..కొన్నాళ్లకు వద్దనుకుంటే..లేజర్‌తో సహా అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. అయితే టాటూ వేయించుకోవడానికి ముందు, తర్వాత మనం తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందాం..
టాటూ వేయించుకునే ముందు..
టాటూ వేసుకునే ముందు మనకు ఇది అవసరమా? నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు వేసిన డిజైన్ కొన్ని రోజుల తర్వాత గుర్తించబడకపోవచ్చు లేదా దాన్ని మనం తీసివేయించలేకపోవచ్చు. బాగా ఆలోచించి మంచి డిజైన్ ను సెలెక్ట్ చేసుకోండి. హడావిడిగా ఎంపిక చేయడానికి అది డ్రస్ కాదు..ఇష్టం లేకపోతే పక్కనపెట్టేయడానికి..టాటూ మీతోనే ఉంటుంది. బాగా చూసి చూసి నచ్చింది సెలెక్ట్ చేయండి.
టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి కాఫీ లేదా ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది. అవి రక్తాన్ని పలుచన చేయడం వల్ల పచ్చబొట్టు పొడిచే సమయంలో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
మీరు టాటూ.. వేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, దానికి ఒక వారం ముందు పుష్కలంగా నీరు తాగటం ప్రారంభించండి. రోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం వల్ల మన చర్మం నునుపుగా, ఆరోగ్యంగా ఉంటుంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే..టాటూ ఆర్టిస్ట్ కొత్త సూదిని ఉపయోగిస్తున్నారా? అని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఎవరైనా ఉపయోగించిన సూదిని ఉపయోగిస్తే అది తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
టాటూ వేయించిన తర్వాత:
కొత్తగా టాటూ వేయించుకున్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్ సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి టాటూ వేయించుకున్న భాగాన్ని అలాగే ఉంచకుండా భద్రంగా బ్యాండేజ్ చేయడం మంచిది. ఇప్పుడు చాలా చోట్ల టాటూ వేసిన తర్వాత బ్యాండ్ వేసే పంపుతున్నారు.
టాటూ వేసుకున్న కొద్ది గంటలు దాన్ని సురక్షితంగా చుట్టి, క్రిమిసంహారక మందు లేదా సబ్బుతో మీ చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.
టాటూపై కనీసం రెండు వారాల పాటు లోషన్, క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని రాయండి. ఇది చర్మానికి రక్షణను పెంచడానికి సహాయపడుతుంది.
పచ్చబొట్టు రంగు మారడం , క్షీణించడం సాధారణం. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పచ్చబొట్టు పొడిచిన భాగాన్ని హానికరమైన రసాయనాలు, సూర్యుని బాహ్య రేడియేషన్ నుంచి రక్షించాలి.
వేసిన రెండు వారాల వరకూ సబ్బుపెట్టొద్దు. వాటర్ కూడా వీలైనంత తక్కవగా పడేట్లు చూసుకోండి.
పచ్చబొట్టు తర్వాత, కనీసం 3 వారాల పాటు ఈత కొట్టడం, హాట్ టబ్‌లలో స్నానం చేయడం , సూర్యరశ్మికి దూరంగా ఉండటం మంచిది.