తెలంగాణ లో విచిత్ర పాలన నడుస్తుంది : జగ్గారెడ్డి

-

మరోసారి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విలువలు లేని రాజకీయం చేస్తుందని, ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేవి.. ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కుల్చేస్తుందంటూ నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి. అధికారంకి ప్రజలు బీజేపీనీ దూరం చేసినా షార్ట్ కట్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, చెండాలమైన రాజకీయాలు చేస్తుందంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. శివసేనలో చీలికలు తెచ్చి… బీజేపీ మహారాష్ట్ర లో ప్రభుత్వం కూల్చిందని, తెలంగాణ లో విచిత్ర పాలన నడుస్తుందని ఆయన సెటైర్లు వేశారు.

మొన్నటి దాకా కుస్తీ పట్టిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ లు ఇప్పుడు సైలెంట్ అయ్యారని, ఛలో ఢిల్లీ అని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఢిల్లీ నుండి మోడీ నే మూడు రోజులు హైదరాబాద్ కి వస్తున్నారన్నారు. బీజేపీ కి పార్టీ ముఖ్యం …ప్రజలు… వాళ్ళ సమస్యలు ముఖ్యం కాదన్న జగ్గారెడ్డి.. బీజేపీ అధికారంలోకి రావాలి…సీట్లు పెరగాలి అనే ధ్యాసే తప్పితే ప్రజల బాధలు పట్టవన్నారు. మోడీని కేసీఆర్‌ కలిసి 2 కోట్ల ఉద్యోగాల గురించి అడగాలని, 15 లక్షలు అకౌంట్ లో వేస్తా విషయం గురించి కూడా అడగాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version