మరోసారి బీజేపీ, టీఆర్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ అమరులను అవమానించేలా మోడీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. కిషన్ రెడ్డి..బండి సంజయ్ లు అమర వీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు. మోడీ కి వంటలు చేస్తున్న యాదమ్మ… వంటల్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువ వెయ్.. కంచాల్లో కాదు.. కండ్లల్ల పెట్టు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నీ మోసం చేస్తున్నందుకు బుద్ది చెప్పు అని.. కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకో.. అగ్నిపథ్ పై కేసీఆర్ నీ స్టాండ్ ఎంటో చెప్పు అని ప్రశ్నించిన రేవంత్.. అసెంబ్లీ పెట్టి వ్యతిరేక తీర్మానం చేయాలన్నారు.
తెలంగాణ గౌరవ ప్రతిష్టను కల్లు కాంపౌండ్ లో చిల్లర పంచాయతీ చేయకండని ఆయన వ్యాఖ్యానించారు. మోడీనీ అడగడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు.. అంతా భయం ఏంది.. ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా అని ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మేము నిరసనకి అప్లై చేస్తే కమిషనర్ అనుమతి ఇవ్వం అంటున్నారు.. రాష్ట్రం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా పని చేస్తుందని, ఇందిరాపార్క్ లో ఆందోళన చేస్తాం అంటే అనుమతి ఇవ్వక పోవడం చూస్తే… బీజేపీ కి టీఆర్‌ఎస్ అంతా సహకారం ఇస్తున్నారన్నారు.