జ‌గిత్యాల‌లో తీవ్ర‌ విషాదం..చెరువులో దూకి ముగ్గురు యువ‌తులు ఆత్మ‌హ‌త్య‌..!

జ‌గిత్యాల ప‌ట్ట‌ణం గాంధీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతులు ఆత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఇద్దరు యువ‌తుల‌కు వివాహం అవ్వగా, మ‌రో యువ‌తి ఇంట‌ర్ చదువుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఎక్కల్ దేవి గంగాజల, మల్లికల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కాగా మరో యువతి వందన మృత దేహం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

jagithyala crime news

అయితే యువ‌తులు ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకోవాల్సి వ‌చ్చింది అనేది మాత్రం మిస్ట‌రీ గానే ఉంది. ఒకేసారి ముగ్గురు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం న‌గ‌రంలో సంచ‌ల‌నం గా మారింది. ఈ ఘ‌ట‌న పై స‌మాచారం అంద‌డంతో స్థానిక‌ టౌన్ సిఐ కిషోర్ అక్క‌డ‌కు చేరుకున్నారు. ప‌రిస్థితిని ప‌రిశీలించి కేసు న‌మోదు చేసుకున్నారు. కుటుంబ క‌లహాల వ‌ల్ల ముగ్గురు యువ‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా..? లేదంటే ఆత్మ‌హ‌త్య‌కు ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు.