న‌టి రంజిత‌ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న నిత్యానంద‌..!

స్వామి నిత్యానంద గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్ప‌ట్లో నిత్యానంద రాస‌లీల‌ల వీడియో తెగ వైర‌ల్ అవ్వ‌డంతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఆ త‌ర‌వాత డ్ర‌గ్స్ వాడిన‌ట్టు ఆరోప‌ణ‌లు, అత్యాచర ఆరోప‌ణ‌లు, ఆశ్ర‌మంలో ఏనుగు దంతాలు, పులి చ‌ర్మాలు ఇలా ర‌క‌ర‌కాల కేసుల్లో క‌ట‌క‌టాల్లోకి వెళ్లిన నిత్యానంద బ‌య‌ట‌కు వ‌చ్చిన భార‌త్ వ‌దిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు. అక్క‌డ ఏకంగా త‌న కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. అంతే కాకుండా త‌న రాజ్యానికి ఇప్పుడు రాణిని కూడా నిత్యానంద నియమించిన‌ట్టుగా తెలుస్తోంది.

nithyananda married actress ranjitha

ఆ రాణి కూడా ఎవ‌రో కాదు. నిత్యానంద‌తో క‌లిసి రాస‌లీల వీడియోలో ఉన్న రంజితే ఆ రాణి కావ‌డం విషేశం. రంజితను వివాహం చేసుకున్న రాస‌లీల‌ల స్వామి త‌న కైలాస రాజ్యానికి ప్ర‌ధానిని చేశాడట‌. అంతే కాదు పోలీసుల‌కు బ‌య‌ప‌డి ఈక్వెడార్ కు పారిపోయిన నిత్యానంద త‌న భ‌క్తుల‌కు ఆన్లైన్ ద్వారా ద‌ర్శ‌నం ఇస్తున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా న‌టి రంజిత మొద‌ట నిత్యానంద భ‌క్తురాలిగా అతడి వ‌ద్ద చేరింది. ఇప్పుడు ఏకంగా అత‌డి ఊహ‌ల్లో ఉన్న కైలాస రాజ్యానికే రాణి అయ్యింది.