‘ఎన్నికల ముందు జై బతుకమ్మ, ఎన్నికలైనంక నై బతుకమ్మ’ : హరీశ్ రావు ఫైర్

-

తెలంగాణ తల్లి నూతన విగ్రహంపై బీఆర్ఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ, వరి కంకులు ఉండేవి. కొత్త విగ్రహంలో బతుకమ్మను తీసేశారు. అభయ హస్తం గుర్తును పెట్టారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ తల్లి విగహ్రంలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ అభయ హస్తం గుర్తు పెట్టారని విమర్శించారు.

అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ అగ్రనేతలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీ బతుకమ్మను ఎత్తిన ఫోటోలను షేర్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ గతంలో చేసిన బతుకమ్మ ఫోటోల ట్వీట్‌ను హరీశ్ రావు రీ ట్వీట్ చేశారు.‘ఎన్నికల ముందు జై బతుకమ్మ-ఎన్నికలైనంక నై బతుకమ్మ?, బతుకమ్మను పక్కకు పెట్టు సోనియమ్మకు జై కొట్టు.. ఇది కదా అసలు సిసలైన మార్పు’ అంటూ సీఎం రేవంత్‌కు ట్యాగ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news