స్నేహితులు ఎవ్వరయినా సరే మేలు మాత్రమే చేస్తారు. ఆ విధంగా మనం ఆ..ఆంధ్రా ఫ్రెండుకు (కేటీఆర్ ఫ్రెండు) కు థాంక్స్ చెప్పుకోవాలి. అంతేకానీ అనవసర మాటల యుద్ధాలకు టైం వేస్ట్ చేసుకోకూడదు. అయినా ఫ్రెండు ఎక్కడి వాడయితే ఏంటి ?తప్పులుంటే చెప్పాలి.. సమస్యలు ఫేస్ చేస్తే వాటిని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకుని వెళ్లాలి.. అంతేకానీ అబద్ధాలు చెబితే లోకం మెచ్చుతుందా లేదు కదా! కనుక కేటీఆర్ ఫ్రెండు కారణంగా మరోసారి మంచే జరిగింది. మళ్లీ నిన్న దావోస్ లో కూడా ఆ ఇద్దరి మధ్య ఈ మాటల ప్రస్తావన వచ్చినా రాకున్నా కూడా మంచే జరిగింది. ప్రాంతాలు తిట్టుకోవడం తగ్గించి మంచికి ప్రాధాన్యం మరోసారి ఇచ్చేయి.
దావోస్ లు ఆ ఇద్దరూ అనగా కేసీఆర్ మరియు జగన్ కలుసుకున్నారు. నవ్వులు రువ్వుకున్నారు. ఇరు పార్టీలలో ఆనందాలు నింపారు. 2 ప్రాంతాలూ సహోదర భావంతోనే ఉండాలి అన్నది ఎప్పటి నుంచో ఇరు ప్రాంతాల నాయకులూ వారిని ఎన్నుకుంటున్న ప్రజలూ కోరుకుంటున్న కోరిక. ప్రాంతాలు సఖ్యతతో ఉంటే రాష్ట్రాలు వృద్ధికి ఆనవాలు అవుతాయి. మంచి పాలన ఇస్తాయి. ప్రాంతాలు కొట్టుకు చస్తే కేంద్రం వచ్చి తీర్పు ఇచ్చి వెళ్తుంది. అదే పెద్ద తలనొప్పిగా ఉంటుంది కూడా ! ఈ విషయమై ఒడిశాను మెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం జోక్యం ఏ విషయంలోనూ ఒప్పుకోదు. కానీ దురదృష్టం మనం మాత్రం ఇంకా కేంద్రం గోడపై చేరబడుతూనే ఉన్నాం.
ఇక పెట్టుబడుల ఆకర్షణ కోసం అక్కడికి వెళ్లిన ఇద్దరు నేతల మధ్య సాగిన సంభాషణల్లో కేటీఆర్ ఫ్రెండ్ గురించి చర్చ ఏమయినా వచ్చిందా ? అంటే ఆ రోజు క్రెడాయ్ మీటింగ్ ఆంధ్రాలో ఏమీ బాలేదు అని పండక్కి ఊరెళ్లిన ఫ్రెండు ఏదో చెప్పానని అన్నారే ! కనుక ఆ మాటలే మళ్లీ మళ్లీ ఇక్కడి వారికి అనగా ఆంధ్రులకు గుర్తుకువస్తున్నాయి. ఆ మాట ఎలా ఉన్నా తప్పులు ఆరోజు అక్కడా ఉన్నాయి.. ఇక్కడా ఉన్నాయి. అయితే మంచి పాలన అందించాలన్న తపనతో ఆ ఇద్దరూ పనిచేస్తున్నారు అన్నది వాస్తవం. ఇందులో రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నా సరే ! మరీ అంత చెడ్డగా ఇద్దరూ రూల్ చేస్తున్నదేం లేదు. అందుకే కేటీఆర్ ఓ మెట్టు దిగి వచ్చి ఆ రోజు సవరణ చెబుతూ ట్వీట్ చేశారు.
కనుక ఆంధ్రా ఫ్రెండు ఎవ్వరయినా సరే ! ఇప్పటికీ ఆయన చేసింది మేలే! ఎలా అంటే ఓ ప్రాంతం తప్పిదాలు మరో ప్రాంతం నేత దగ్గర ప్రస్తావించడం తప్పు కాదు. దిద్దుకోకపోవడం తప్పు ! కనుక పాలనలో వైఫల్యాలు జగన్ దిద్దుకుంటున్నారు. కాదనలేం..కొన్ని సార్లు మొండికేస్తున్నారు కూడా ! ఇది కూడా కాదనలేం. అయినా ! కేటీఆర్ , జగన్ కలిసి పనిచేసే సమయం రానే వచ్చింది. రానున్న 2 ఏళ్లలో అవి అనగా ఆ కలలు నెరవేరితే చాలు. కేటీఆర్ ఫ్రెండు కూడా ఆనందిస్తాడు.