ఇంట్లోని పూజ గదిలో వీటిని ఉంచితే దరిద్రం పట్టినట్లే..

-

హిందూవులు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. అయితే పూజగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా కొన్ని వస్తువులను పూజ గదిలో పెట్టకూడదు అని జ్యోతిష్య పండితులు అంటున్నారు..వాటిని ఉంచడం మూలానా ఇంట్లో చికాకులు..ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయని అంటున్నారు. అవేంటో ఒకసారి చుద్దాము..

పూజ గదిలో ఆరు వస్తువులను ఉంచకూడదని సూచించారు. ఇలా చేయడం వలన దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. మీ ఇంట్లో పూజ గది ఉంటే మీరు కూడా ఈ నియమాలను అనుసరిస్తున్నారో లేదో ఒకసారి చూడండి. ఒకవేళ పూజ గదిలో ఇలాంటివి ఉంచితే వెంటనే తీసేయండి..

పూజ చేస్తున్న సమయంలో చెయ్యకూడని తప్పులు ఎంటో ఒకసారి చుద్దాము..

ఇంటి పూజ గదిలో దేవుడి విగ్రహాలను ఒకటి కంటే ఎక్కువ ఉంచకూడదు. లేదా ఆ దేవుడి పటాల సంఖ్య 3, 5, 7 సంఖ్యలో ఉండకూడదని గుర్తుంచుకోండి..ఇలా వుంచితే అశుభం.. ఇంటి పూజగదిలో శివలింగాన్ని ఉంచుతారు. అయితే శివలింగాన్నీ ఇంట్లో పూజించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉండకూడదని శివపురాణంలో చెప్పబడింది. శివలింగం నుండి శక్తి అన్ని సమయాల్లో ప్రసారం అవుతుంది. కాబట్టి.. శివలింగాన్ని ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. ఇంటి పూజ గదిలో ఉంచే దేవుడి చిత్ర పటాలను ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు నవ్వుతు ఉన్న దేవుడి చిత్ర పటాలు ఇంట్లో సానుకూలతను తెస్తాయి.

పూజ గదిలో దేవుడి విగ్రహం లేదా పటం విరిగినా, చిరిగిన వాటిని పూజకు ఉపయోగించవద్దు. విరిగిన లేదా పగిలిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అశుభం. ఇది వాస్తు దోషాలకు దారి తీస్తుంది. అలాంటివి ఏమైనా ఇంట్లోని పూజ గదిలో ఉంటె వెంటనే వాటిని పూజ గది నుంచి వెంటనే తొలగించండి.పూజ సమయంలో అక్షతలు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నాయి. ఈ అక్షతలు పూజలో పువ్వులు లేని లోటును కూడా తీరుస్తాయి. అయితే ఈ అక్షతల తయారీకి విరిగిన బియ్యం ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం అశుభంగా పరిగణించబడుతుంది. కనుక ఇంటి పూజ గదిలో విరిగిన బియ్యంతో అక్షతలు ఉంటే వాటిని ఈరోజే తీసేసి బియ్యంతో అక్షతలు తయారీ చేసుకోండి..అవి ఎంత బాగుంటే కుటుంబం అంత బాగుంటుంది అని అందరి నమ్మకం..ఇవి గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version