“జైలర్” సక్సెస్ … కాన్సర్ హాస్పిటల్ కు నిర్మాతల సహాయం !

-

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ లను అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో అధికంగా లాభాలను అందుకున్న నిర్మాతలు రెండు రోజుల క్రితం 100 మంది చిన్న పిల్లలకు సర్జరీలు చేయడానికి అపోలో హాస్పిటల్ కు రూ. కోటి రూపాయలు సహాయంగా ఇచ్చారు. తాజాగా మరో మంచి నిర్ణయం తీసుకున్నారు చిత్ర నిర్మాతలు.. కనీసం చికిత్సను కూడా తీసుకోలేని ఎందరో పేదల కోసం అండయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్ డాక్టర్ హేమంత్ రాజాకు రూ. 60 లక్షల చెక్కును ఇచ్చారు. ఎంతో మంది సినిమాలను తెరకెక్కించి కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకుంటున్నారు.

కానీ ఇలాంటి మంచి పనులకోసం కూడా కొంచెం సహాయంగా ఇస్తే ఎందరికో ఉపయోగపడుతుంది. ఈ విషయం ప్రస్తుతం తమిళ్ సినిమా పరిశ్రమలో వైరల్ గా మారింది. మరి వీరిని చూసి మరికొంతమంది నిర్మాతలు మారుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version