వినాయకచవితి వేళ.. నటుడు వినాయకన్ అరెస్ట్..!

-

వినాయక చవితి వేళ..  శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, పోలీసులు మలయాళ నటుడు వినాయకన్‌ ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కొట్టాడు వినాయకన్‌. మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా  వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు అప్పగించిన సీఐఎస్ఎఫ్‌. రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్‌ అయ్యాడు వినాయకన్‌.

ఇప్పటికే పలుమార్లు దురుసుగా ప్రవర్తించి, దాడులు చేసి అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు జైలర్ మూవీ విలన్ వినాయకన్. ఇటీవలే  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో CISF వాళ్లపై నటుడు వినాయకన్ దాడికి పాల్పడ్డాడు. తాజాగా  వినాయకన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొచ్చిన్ సినిమా షూటింగ్ ముగించుకొని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ ఫోర్టులో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయకన్ గోవాలో సెటిల్ అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version