గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గణేష్ ఉత్సవాలు అంటేనే తొలుత గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడిని  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అద్భుతంగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని తెలిపారు.

దాదాపు 70 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు పూజిస్తున్నారని వెల్లడించారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందని తెలిపారు. దివంగత నేత పి.జనార్థన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఖైరతాబాద్ లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా.. ప్రస్తుతం సీఎంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతీ ఏడాది ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవాలకు ఎప్పుడూ ఆహ్వానించినా వచ్చి తప్పకుండా స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటానని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version