రజినీ “జైలర్” నుండి ఫస్ట్ సాంగ్ అప్డేట్…!

-

సూపర్ స్టార్ రజినీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం “జైలర్”.. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈయన తీసిన గత చిత్రం విజయ్ తో బీస్ట్ చాలా నిరాశను మిగిల్చింది. దీనితో చాలా భయం మరియు బాధ్యతతో ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఒక కొత్త అప్డేట్ తాజాగా వచ్చింది. ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. తమన్నా ఆడిపాడనున్న “కావాలా” అంటూ సాగే ఈ సాంగ్ కోసం రజినీ కాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్, తమన్నా లతో పాటుగా రమ్యకృష్ణ, మోహన్ లాల్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు పర్ఫెక్ట్ గా జరిగితే ఈ సినిమాను ఆగష్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరి ఇప్పటి వరకు విడుదల అయిన పోస్టర్ లు మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. ఇక రేపు విడుదల కానున్న పాట తర్వాత అంచనాలు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version