అమితాబచ్చన్ నివాసం ఉంటున్న జల్సా రెసిడెన్స్ కంటైన్‌మెంట్ జోన్… !!

-

కరోనా విజృంభణ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే అంది.. అయితే ఈ కరోనా తాకిడి టాలీవుడ్ సీరియల్ యాక్టర్స్ నుంచి బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ దాక సోకింది.ఇప్పుడు కరోనా సెగ బాలీవుడ్ కి తాకింది అని అందరూ అయోమయంలో మునిగిపోయారు. దానికి కారణం బాలీవడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబచ్చన్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం, స్వయానా నాకు కరోనా పాజిటివ్ వచ్చింది ఆని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. అమితాబ్ కి పాజిటివ్ అని తెలియగానే బాలీవడ్ మొత్తం కంగారు పడింది. అయితే అమితాబ్ ముంబై లోని నానావతి హాస్పిటల్ లో కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు.

amitha bachan

అమితాబచ్చన్ ముంబై లోని ఓ సెలెబ్రిటీ పుట్టిన రోజు పార్టీకి వెళ్లి అక్కడనుండి అమితాబచ్చన్ కరోనా బారిన పడినట్లుగా  తెలుస్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనకూడా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక అమితాబ్ ఇంటిలోని వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోగా అందరికి నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక అమితాబ్ నానావతి హాస్పిటల్ లోని డాక్టర్స్ తనకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారని.. వారు తనని బాగా చూసుకుంటున్నారని.. ఇక పది రోజుల నుండి తనతో కాంట్రక్టు అయినా వారంతా దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోవాలని అమితాబ్ కోరుతున్నారు.అమితాబ్ నివాసం ఉంటున్న భ‌వ‌నాన్ని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. బిల్డింగ్ బ‌య‌ట కంటైన్‌మెంట్ జోన్ అని నోటీసును అతికించారు. అనంత‌రం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.ఇటీవలే అమితాబ్ బచ్చన్ కామెడీ-డ్రామా గులాబో సీతాబోలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి కనిపించారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, అయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version