ఏపీలో కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుబెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ముఖ్యమంత్రి వ్యవహారశైలిని అధికారులు కూడా తప్పుబడుతున్నారని మాజీ మంత్రులు, వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో సోమవారం మద్యం టెండర్లు పూర్తయిన విషయం తెలిసిందే. కొత్తగా ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై వైసీపీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.‘త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయి.ఈ ప్రభుత్వం ఉండేది రెండేళ్లే.అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి.90శాతం మద్యం షాపులు టీడీపీ నేతలకే దక్కాయి. మంత్రులు,ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగింది. విద్య, వైద్యం, మద్యం షాపులు.. ఇసుక, గ్రావెల్స్ మొత్తం సిండికేట్స్‌గా మారాయి. చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ కోసమే కొత్త మద్యం పాలసీ తెచ్చారు.
ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది అని కాకాణి హెచ్చరించారు.