దామగుండం రాడార్ సెంటర్‌పై గులాబీ పార్టీ కొత్త డ్రామాలకు తెరలేపిందని, రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.ఈ రాడార్ సెంటర్ ఏర్పాటుకు 2017 డిసెంబర్ 12నే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని, జీవో 44ను విడుదల చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి.. దామగుండం రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ దేశ భద్రతకు సంబంధించినదని, ఈ ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వచ్చాక ఒకలా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ భూమి కేటాయించడంలో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్ట్ కూడా లేట్ అయిందని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ భూమి కేటాయించడంతో దామగుండం రాడార్ సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్నామన్నారు. ఇది పూర్తయితే రాష్ట్రానికే మంచి పేరు వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.