జమ్మూలో కాంగ్రెస్ కూటమి గెలుపు.. మూడు పార్టీలకి కలిపి ఎన్ని సీట్లు వచ్చాయంటే..??

-

జమ్మూ కాశ్మీర్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి.. హంగు అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ కూటమీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్సి 51 చోట్లా, కాంగ్రెస్ 32 చోట్లా సిపిఎం, జే కే ఎన్ పి పి ఒక్కో చోట పోటీ చేశాయి.. ఇందులో ఎన్సీ 42 స్థానాల్లో గెలుపొందగా, బిజెపి 29 స్థానాలు కాంగ్రెస్ ఆరు స్థానాలో గెలిచింది. సిపిఎం ఒక్క స్థానంలో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ కూటమి 49 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

జమ్మూలో కమలం జ్యోష్ కనిపించింది. ఇక్కడ హిందూ జనాభా ఎక్కువ. కాశ్మీర్లో ముస్లిం ప్రాబల్యం అధికం. ఉమ్మడి రాష్ట్రంలో 87 సీట్లు ఉండేవి. ఆర్టికల్ 370 రద్దు చేశాక అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ మిగిలింది. నియోజకవర్గాల అప్పన్న విభజన చేపట్టి ఎన్నికలు నిర్వహించారు. దీంతో జమ్మూలో సీట్ల సంఖ్య 37 నుంచి 43 కు చేరింది. కాశ్మీర్ లోయలో సీట్లు మాత్రం ఒకటి పెరిగి 47 అయ్యాయి.. ఇక జమ్మూలోనూ 43 సీట్ల గాను చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బిజెపి 29 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

కాశ్మీర్ లోయలో 47 స్థానాలకు గాను ఇండియా కూటమి 41 స్థానాల్లో గెలవగా.. పిడిపి మూడు స్థానాల్లో గెలిచింది.. జమ్ములో 43 సీట్లు ఉండగా ఇండియా కూటమి ఎనిమిది స్థానాల్లో గెలవగా బిజెపి 29 స్థానాలలో తన సత్తా చాటింది.. ఇతరులు ఆరు స్థానాలను కైవసం చేసుకున్నారు.. మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 49 స్థానాల్లో గెలవగా బిజెపి 29 టిడిపి మూడు స్థానాలు, పిడిపి 3 స్థానాలో గెలిచారు.

బిజేపీ జమ్మూ కశ్మీర్ రాష్ట అధ్యక్షులు రవీంద్ర రైనా కూడా ఓటమిపాలయ్యారు.. నౌషేరా అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన.. నేషనల్ కాన్పరెన్స్ అభ్యర్ది సురీందర్ చౌదరి చేతిలో ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.. అలాగే ఎన్సీ పార్టీ నుంచి పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా బుద్గాం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పక్కా వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగింది.. టార్గెట్ బిజేపీ అన్నట్లుగా ప్రచారం చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version