జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను వరసగా ఖతం చేస్తున్నాయి మన భద్రతా బలగాలు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కర్ ఏ తోయిబా కీలక కమాండర్ ను హతమార్చాయి. తాజాగా కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో నివసిస్తున్న నాన్ లోకల్స్ పై దాడులకు తెగబడుతున్న ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతా బలగాలు. పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.