జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర ఘాతుకం… ఇద్దరి పోలీసుల్ని కాల్చి చంపిన టెర్రరిస్టులు..

-

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కొన్నాళ్లుగా భద్రతా బలగాల చేతిలో చావు దెబ్బతింటున్న ఉగ్రవాదులు అదును చూసి దొంగ దెబ్బ తీశారు. విధుల్లో ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఉత్తర కాశ్మీర్ లోని బందిపోరా లోని గుల్షాన్ చౌక్ లో కాల్పలు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు హఠాత్తుగా దాడి చేయడంతో ఇద్దర పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మహ్మద్ సుల్తాన్ మరియు కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా స్థానిక ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తుండగా.. వీరిద్దరు మరణించారని అధికారులు తెలిపారు.

ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని చుట్టు ముట్టి గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కాలంలో వరసగా ఎదురుదెబ్బలు తింటున్న ఉగ్రవాదులు.. తొలిసారిగా పోలీసులను చంపారు. రెండు రోజుల క్రితం భద్రతా బలగాలు చేపట్టిన ఎన్ కౌంటర్ లో కూడా ముగ్గురు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదును హతమార్చారు. షోఫియాన్ లోని చాక్ ఇ చోలెన్ గ్రామంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ జరిగిన రెండు రోజుల తర్వాత ఉగ్రవాదులు పోలీసులపై ఘాతుకానికి తెగబడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version