ఉగ్రవాదుల బరితెగింపు…. కాశ్మీర్ లో ఇద్దరు నాన్ లోకల్స్ పై కాల్పులు

-

కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు బరి తెగించారు. గతంలో మాదిరిగానే నాన్ లోకల్స్ పై కాల్పులు జరిపారు. గతంలో కూడా ఇలానే కాశ్మీర్ లో పని చేసేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల వారిపై, రోజూ వారీ కూలీలపై కాల్పులు జరిపి పలువురిని బలిగొన్నారు. తాజాగా ఇలానే ఇద్దరు పంజాబ్ రాష్ట్రం పటాన్ కోట్ కు చెందిన ఇద్దరిపై కాల్పులు జరిపారు. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా లిట్టర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూలీలపై కాల్పులు జరపడంతో వారు గాయపడ్డారు. ఘటనపై కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే లష్కరే తోయిబాకు చెందిన దిరెసిస్టెంట్ ఫోర్స్ పేరిట కాశ్మీర్ లోని నాన్ లోకల్స్ అయిన బీహార్ వాసులను కాల్చి చంపారు. ఇతర రాష్ట్రాల వాళ్లపై కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ లో పర్యటించి అధికారులకు దిశానిర్థేశం చేశారు. ఆతరువాత భద్రతా దళాలు ఈ దాడులకు పాల్పడిన వారిని కాల్చి చంపారు. ఇదిలా ఉంటే ఆదివారం రోజున బండిపొర పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను ఛేదించారు. జిల్లాల్లో ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ & రవాణా అందిస్తున్న నిషేధిత సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version