జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని మరో వంగవీటి రంగాగా ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వంగవీటి రంగాను కొంత మంది నాయకులు కలిసి అప్పటి ప్రభుత్వం చేతే చంపించారని ఆరోపణలు చేశారు. నాకు రక్షణ కల్పించండి అని వంగవీటి రంగ నిరాహార దీక్ష కూడా చేశారని పేర్కొన్నారు.

బడుగు బలహీన వర్గాల కోసం అయన అనేక పోరాటాలు చేశారు… అలంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఆరుగోలనులో రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో జనసేన ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వంగ వీటి రంగా హత్య సమయంలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉంది.
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
వంగవీటి రంగాను ప్రభుత్వంతోనే చంపించారు
రంగా హత్య సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం
ఆరుగోలనులో రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడిన బొలిశెట్టి pic.twitter.com/xDGAQZ5Bhc
— greatandhra (@greatandhranews) August 18, 2025