స్నేహం పేరుతో వస్తున్న మానసిక భారం? హెచ్చరికలు..ఇవే

-

స్నేహం అనేది జీవితంలో ఎంతో అమూల్యమైన బంధం కానీ కొన్నిసార్లు అది మానసిక భారంగా మారుతుంది. మనం ఎదుటి వ్యక్తితో ఎంతో స్నేహంగా ఉన్న, వారు అంతే మనతో స్నేహంగా వుంటున్న కొన్నిసార్లు మన మనసుపై కొంత భారం పడుతుంది.ఇలా ఎందుకు అని ఆలోచిస్తే స్నేహితుడి లో వచ్చిన మార్పు అని అర్ధం అవుతుంది.ఇలా స్నేహం పేరుతో వచ్చే ఈ మానసిక ఒత్తిడిని గుర్తించడానికి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. వాటిని సరైన టైంలో గుర్తిస్తే మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు మరి ఎలాంటి హెచ్చరికలను ఇప్పుడు మనము తెలుసుకుందాం..

Friendship Stress Mental Strain and Signs That Call for Attention

ఒకవైపు మాత్రమే : స్నేహమంటే ఇద్దరూ కలిసి మెలిసి ఎల్లవేళలా ఉండడం. ఒకరి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు సహాయ పడడం. స్నేహంలో ఎల్లప్పుడూ మీరే కష్టపడుతున్నారా? మీరు మాత్రమే కాల్ చేయడం మీరే టూర్ ప్లాన్ చేయడం లేదా ఏదైనా సమస్య వస్తే మీరు మాత్రమే పరిష్కరించడం చేస్తున్నారా అలా ఒకవైపు ఒకరు మాత్రమే ప్రతిదానికి ముందుకు వెళ్తుంటే మీ మనసుపై అది ఒత్తిడి కలిగిస్తుంది.

నిరంతర విమర్శలు: మీ స్నేహితుడు మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తూ, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారా? కొంతకాలం మీ స్నేహం సంతోషంగా సాగిన ఇప్పుడు మీ స్నేహితుడు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నాడా? ఇది మీ మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అసూయ, పోటీ : ఇప్పటివరకు ఇద్దరు స్నేహితుల మధ్య ఎలాంటి పోటీ లేకపోయినా ఇక ఇప్పుడు మీ మధ్య ఏదైనా పోటీ తలెత్తుతుందని మీ మనసు మీకు చెబుతుందా? స్నేహితుడు మీ విజయాలను సంతోషంగా జరుపుకోకుండా, అసూయతో లేదా పోటీ తత్వంతో వ్యవహరిస్తుంటే అది మీ మనసుపై ఒత్తిడి కలిగిస్తుంది.

మీకు గౌరవం తగ్గినప్పుడు : మీరు ఏదైనా కష్టం లో ఉంటే మీ స్నేహితుడు మీ భావాలను గౌరవించకుండా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా? మీ కష్టాన్ని తన కష్టంలా అనుకోకుండా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే దాన్ని మీరు భారంగా మోస్తూ స్నేహాన్ని విడగొట్టడం ఇష్టం లేక సతమతం అవుతుంటే, అది మీ మనసుపై ఒత్తిడిని కలిగిస్తుంది.

అతిగా ఆశ్రయించడం : స్నేహితుడు తన సమస్యల్ని మీపై వేస్తూ మీ సొంత జీవితానికి సమయం లేకుండా చేస్తున్నారా? ప్రతి చిన్న,పెద్ద సమస్యలకు మీకే ఫోన్ చేసి మిమ్మల్ని అతిగా విసిగిస్తున్నాడా? ఇలా గనక చేస్తూ ఉంటే అది మీ మనసుపై భారాన్ని పెంచుతుంది మీకు ఆ స్నేహం భారం అనిపిస్తుంది.

ఏం చేయాలి: మీ సమయం, శక్తిని రక్షించుకోవడానికి స్పష్టమైన సరిహద్దును ఏర్పాటు చేయండి. మీ ఆందోళనను స్నేహితుడితో హృదయపూర్వకంగా చర్చించండి. ఇంతకుముందు మీరు గడిపిన ప్రతి క్షణాన్ని మీ ఫ్రెండ్ తో పంచుకోండి. ఇప్పుడు తనలో వచ్చిన మార్పుని తనకి స్పష్టంగా చెప్పండి. మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యత చూసుకోండి. అవసరమైతే విశ్రాంతి తీసుకోండి స్నేహాన్ని తగ్గించండి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటే మంచి డాక్టర్ని సంప్రదించండి. ఏది ఏమైనా స్నేహం సంతోషాన్ని మద్దతుని ఇవ్వాలి ఒత్తిడిని కాదు. ఈ సంకేతాలను గుర్తించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news