జనసేన మరో శివసేన అవుతుందా…?

-

అసలు జనసేన పార్టీ భవిష్యత్ ఏంటి…? ఈ ప్రశ్నకు పార్టీ పెట్టి ఏడేళ్ళు అవుతున్నా ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఆయన రాజకీయ వ్యూహాలు ఏమిటి ఆయన ఏవిధంగా వ్యవహరించాబోతున్నారు, అనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. ఆయన ఇప్పుడు బిజెపిని పొగడటం అనేది చాలా మందికి వింతగా విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో పవన్ కూడా గెలవలేదు కాబట్టి పార్టీ మూసేస్తారనే ప్రచారం ఎక్కువగా జరిగింది.

అయితే ఈ తరుణంలో ఆయన బీజేపీని పొగడటం ఏంటో అర్దం కాలేదు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు వెళ్లారు ఏంటనేది చెప్పలేదు. అయితే ప్రతిసారీ కేంద్రానికి ఫిర్యాదు చేశాను, ఏదో జరగబోతోంది అన్న సంకేతాలు మాత్రం ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాతో సమావేశమయ్యారు. ఆదివారం ఉన్నపళంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి,

అక్కడ ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే అమరావతి ఉద్యమాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో జగన్ పాలన పై ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అయినప్పటి నుంచి జగన్ను పదేపదే టార్గెట్ చేస్తూ అసలు జగన్ ను ముఖ్యమంత్రిగా గుర్తించను అని చెప్తూ, బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ కి ఫిర్యాదు చేస్తానని చెప్పడం వంటివి బీజేపీ లో జనసేన పార్టీని విలీనం చేస్తారనే అనుమానాలు రేకెత్తించింది. విశాఖలో ఇసుక సమస్యపై తెలుగుదేశం పార్టీ మద్దతుతో,

ఆయన చేసిన లాంగ్ మార్చ్ కూడా బీజేపీకి తన బలాన్ని చూపించే విధంగానే ఉందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇక ఇప్పుడు రాష్ట్రంలో తనకు సన్నిహితంగా ఉండే చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం తో దానికి బీజేపీ మద్దతు అవసరం అయింది. రాష్ట్ర బీజేపీ అమరావతినే ఆ రాజధానిగా ఉంచాలని చెప్తూ, ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసిన వెంటనే ఢిల్లీ విమానం ఎక్కిన పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీ నేతలతో సమావేశమై తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి,

భవిష్యత్తులో జనసేన ని బీజేపీ పొత్తు పెట్టుకుంటే రాష్ట్రం ఏ విధంగా పోరాడాలి అనే విషయం వారితో చర్చించినట్లు సమాచారం. బీజేపీ లో విలీనం చేస్తారని లేదా పొత్తు పెట్టుకుంటారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. పొత్తు కంటే కూడా పార్టీని విలీనం చేయడానికి పవన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఈ తరుణంలో కొన్ని విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి మాదిరిగానే బీజేపీ లో విలీనం చేస్తున్నారు.

అన్నదమ్ములిద్దరూ పార్టీలు జాతీయ పార్టీల కోసం పెట్టారని అంటున్నారు. ఇకపోతే ఎన్నికల్లో ఓడిపోయినా సరే ప్రజల్లో ఉంటూ రైతుల సమస్యల మీద యువత సమస్యల మీద, నీటి సమస్య మీద పోరాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ లో విలీనం చేయటం అంటే పార్టీని అలాగే జనసేన కార్యకర్తలు అభిమానులను అవమానించినట్లేననే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన మరో శివసేన అవుతుందని అంటున్నారు కొందరు రాజకీయ పరిశీలకులు. మహారాష్ట్రలో శివసేన పెట్టినప్పటి నుంచి బీజేపీకి పెద్ద దిక్కుగా ఉంది.

బిజెపి మహారాష్ట్ర అధికారంలోకి వచ్చింద౦టే ఇప్పటివరకు శివసేన పుణ్యమే. అలాంటి పార్టీని కూడా బీజేపీ అధికారం కోసం ఏ మాత్రం లెక్కచేయలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్లో ఏ మాత్రం విలువ ఉంటుందని జనసేన పార్టీ అందులో విలీనం చేసిన లేకపోతే పొత్తు పెట్టుకున్నా సరే ఎక్కువ పెత్తనం బీజేపీది మాత్రమే ఉంటుందని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి జనసేన పార్టీని విలీనం చేసిన సరే ఎటువంటి ఉపయోగం ఉండదు. పవన్ కు ఆరు శాతం ఓటు బ్యాంకు రాగా,

బీజేపీకి ఒక్క శాతం కూడా రాలేదు. అలాంటి పార్టీతో పవన్ ముందుకు వెళ్తే నష్టం తప్ప లాభం లేదు అనేది కొందరి వాదన. ముఖ్యంగా పార్టీ అభిమానులు అయితే అసలు అలాంటప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు విలీనం చేయడం ఎందుకు…? తమ పరువు పోతుందని సామాజిక వర్గం విలువ కూడా పోతుందనే వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు చేస్తున్నారు. త్వరలో బిజెపి నేతలతో జనసేన నేతలు భేటీ అవుతున్నారు. విజయవాడలో ఈ సమావేశం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version