ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పరిషత్ ఎన్నికలు రద్దు చేయాలని జనసేన పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్ లో జనసేన పేర్కొంది. ఇక ఇదే విషయం మీద నిన్న బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ రెండు పిటిషన్లను మధ్యాహ్నం రెండు గంటలకు హైకోర్టు విచారించనుంది. పరిషత్ ఎన్నికల కోసం పాత నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో రాజకీయంగా తీవ్ర దుమారం లేచింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. పరిషత్ ఎన్నికలపై చర్చించేందుకు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన సమావేశాన్ని కూడా బహిష్కరించాయి.