టిడిపి జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీలు ఈ రోజు సీట్లు ని ప్రకటించగా టికెట్ వస్తుందని ఆశించి రాలేదని కొంతమంది నేతలు బాధపడుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుండి జనసేన టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్చార్జి సూర్యచంద్రకి టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా జగ్గంపేట టిడిపి కి కేటాయించారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ టిడిపి నుండి టికెట్ ని దక్కించుకున్నారు. మొదట నుండి జనసేనలో కష్టపడుతూ టికెట్ ఆశించిన సూర్యచంద్ర సీటు దక్కకపోవడంతో ఒకసారిగా కంటతడి పెట్టుకున్నారు.
మొదటి నుండి ఇంటికి దూరంగా పార్టీ కార్యక్రమాలకి దగ్గరగా ఉంటూ పార్టీ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు అందుకని ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ధర్మంగానే ఉన్నానని ఇప్పుడు పొత్తులో భాగంగా అధినేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే చేసే వరకు కష్టపడతానని అన్నారు.