మెగా అభిమాన సంఘాల నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశo నిర్వహించింది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు హాజరు అయ్యారు. అంధకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది…అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారి బాధ్యత తీసుకోవాలన్నారు నాదెండ్ల మనోహర్. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలి..రాజకీయంగా జనసేన పార్టీ రూపంలో ఒక క్లీన్ ప్లాట్ ఫామ్ మనకు ఉందన్నారు.
పార్టీని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ను మఖ్యమంత్రి చేయడానికి అంతా కలసి రావాలి…ఈ ప్రయాణంలో ఎక్కడా బేధాభిప్రాయాలు లేకుండా కలసికట్టుగా ముందుకు సాగుదామని కోరారు నాదెండ్ల మనోహర్.అభిమాన సంఘాలుగా మీ ఆలోచనల్లో స్పష్టత అవసరం…100 శాతం జనసేన జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలి…గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పారు నాదెండ్ల మనోహర్.