హరీష్ రావు, సీఎం కేసీఆర్ లకు ఈటల సవాల్..చర్చకు సిద్ధమా !

-

సీఎం కెసిఆర్ చెప్పే మాటలు అన్నీ పచ్చి అబద్ధాలు అని మరో సారి నిరూపించబడిందని..ఆర్భాటంగా ప్రకటించిన పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి వెల వెల పోతుందని పేర్కొన్నారు ఈటెల రాజేందర్. అధికార పార్టీ నేతలే మొహం చాటేస్తున్నారు..అవమాన భారంతో అధికార పార్టీ సర్పంచ్ లు కుమిలిపోతున్నారని ఫైర్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ లకు నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు..కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ధ్వారనే పల్లెలలో పనులు అవుతున్నాయన్నారు. రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తా అని మాట ఇచ్చి కేసీఆర్ మాట తప్పారు..Vro ల పరిస్థితి అంత్యంత దారుణంగా వుందన్నారు ఈటెల రాజేందర్. అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ని తిరిగి తీసుకుంటా అని హామీ ఇచ్చి నేటికి నెరవేర్చలేదు…ముఖ్యమంత్రి ఎవరినీ కలవరు… ఎవరు చెప్పినా వినరని ఆగ్రహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే..పల్లెలు వల్లకాటుగా మారే ప్రమాదం వుంది..ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్..నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నాడన్నారు. 3 లక్షల వరకు తీసుకొనే రుణాలను మహిళ సంఘాలకు కేంద్ర ప్రభుత్వమే 7%వడ్డీ చెల్లించింది…మహిళా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మహిళలలు ఎదిగేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది.రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉసురు తీస్తుందన్నారు. అభయహస్తం పథకం లో 22లక్షల సభ్యులు ఉన్నారు..అభయ హస్తం స్కీమ్ తో పెన్షన్,ఇన్సూరెన్స్,స్కూల్ కి వెళ్లే పిల్లలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది…ముఖ్యమంత్రి చర్చకు వస్తాడా? ఆర్ధిక మంత్రి చర్చకు వస్తాడా..నేను సిద్ధం అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version