ఎక్కడలేని వింతలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో చూస్తున్నాం.. ఎమ్మెల్యే టికెట్ ఊరకనే వస్తుందా?? ఎన్నో పైరవీలు చేయాలి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి.. అదీగాక పబ్లిక్‌లో కాస్తో కూస్తో పేరుండాలి. జనసేన పార్టీ అధినేత ఓ మహిళకి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. జనసేన పార్టీ తరుపున గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిగా కొచ్చర్ల రమాదేవి పవన్ ఎంపిక చేశారు.
విషయం తెలిసిన రమాదేవి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక ఆమెకు ఆంధ్ర ప్రదేశ్‌లో ఓటు లేదని తెలిసి బిత్తరపోయింది.ఆమె ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీని కలిసి తన ఓటుహక్కును హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తికి మార్చాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. గడువు ముగిసినందున అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని తెలిపారు.
అయ్యో దేవుడా.. ఎమ్మెల్యే టికెట్ వచ్చినా.. ఓటు హక్కు లేకపాయే.. దేనికైనా రాసిపెట్టి ఉండాలనుకుంటూ నిట్టూరుస్తూ వెనుదిరిగారు సదరు మహిళ అనుచరులు, జనసైనికులు.. అదేం విచిత్రమోగానీ ఓటులేని వారికి సీటిచ్చి నవ్వుల పాలయ్యారు జనసేనాని..
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు హక్కు లేదు.. టికెట్ వచ్చినా.. ప్చ్
-