విశాఖ నుంచి విజయవాడకు పవన్‌ కల్యాణ్

-

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖపట్నం నుంచి తిరుగు పయనమయ్యారు. ‘జనవాణి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం విశాఖ వెళ్లిన ఆయన.. పోలీసుల ఆంక్షలతో నోవాటెల్‌ హోటల్‌కే పరిమితమయ్యారు. విజయవాడ నగరంలో సెక్షన్‌ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దంటూ ఆదివారం మధ్యాహ్నం పోలీసు అధికారులు పవన్‌కు నోటీసులిచ్చారు.

పోలీసుల ఆంక్షలతో రెండు రోజులు హోటల్లోనే ఉండిపోయిన ఆయన.. ఇవాళ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరారు. పవన్‌తో పాటు జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, గోవిందు రామాంజనేయులు ఉన్నారు. విజయవాడ చేరుకున్న అనంతరం పవన్‌ నేరుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లనున్నారు.

పవన్‌ మంగళవారం రోజున రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నారు. విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇప్పటికే జనసేన నేతలు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version