టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసిన ఈడి

-

గతంలో ఖమ్మం టిఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాల నిర్వహించిన సంగతిి తెలిసిందే. బ్యాంకులో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని విదేశీ కంపెనీలకు మళ్ళించారు అనే అభియోగాలపై నాగేశ్వరరావు కార్యాలయాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేశారు ఈడి అధికారులు. నామ నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ.80.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు.

జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలోని 28 స్థిరాస్తులను అటాచ్ చేశారు. గతంలో రూ. 73.74 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రాంచి ఎక్స్ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకుని దారి మళ్ళించారని ఈడీ అధికారులు చెబుతున్నారు. సుమారు రూ. 361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించారు ఈడి అధికారులు. నామా నాగేశ్వరరావు, నామ సీతయ్య ఆధీనంలోని ఆరు డొల్ల కంపెనీలను గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version