రసికరాజా ఇద్దరు మంత్రుల పేరుతో సినిమా తీస్తాం – జనసేన

-

రసికరాజా ఇద్దరు మంత్రుల పేరుతో సినిమా తీస్తాం అని తిరుపతి ఇంచార్జ్ జనసేన పార్టీ కిరణ్ రాయల్ అన్నారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విషసర్పాలంటూ పోస్టర్ ఆవిష్కరించారు. జగన్ రెడ్డి పేరు జైల్ రెడ్డి..కేరాఫ్ చంచల్ గూడ జైలు అని.. సిఎంను ఇక నుంచి జైల్ రెడ్డి అని పిలుస్తామని హెచ్చరించారు. మొన్నటి వరకు జగన్ మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించిన మంత్రులు జొకర్లు అని.. కొత్తగా వచ్చిన మంత్రులు బఫూన్లు ఉన్నారని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ ను విమర్శించిన కాపు మంత్రుల చీటీని జగన్ చెంచేశారు.. పోలవరం ప్రాజెక్టుకు సంజన సుకన్య గా పేరు మార్చితే అంబటి రాంబాబు త్వరగా పూర్తి చేస్తారేమో…? అని మండిపడ్డారు. రసికరాజా ఇద్దరు మంత్రుల పేరుతో సినిమా తీస్తామని.. అమరనాథ్, అంబటి రాంబాబులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రజలే ఇద్దరు మంత్రులను చెప్పులు, చాటలతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి.. పవన్ కళ్యాణ్ ను విమర్సించే అర్హత ఇద్దరు మంత్రులకు లేదని.. పవన్ కళ్యాణ్ తో ఫోటో కోసం పాకులాడిన వ్యక్తి అమర్ నాథ్ అని మండిపడ్డారు. అంబటి నోరు అదుపులో పెట్టుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version