తెలంగాణా ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండు ఉదయం ఆరు గంటల వరకు జనతా కర్ఫ్యూ ని పెంచుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ 24 గంటలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని, తెలంగాణాలో చీమ చిటుక్కుమనకుండా చూడాలని ఆయన సూచించారు.
రేపు సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సైరన్ మొగిస్తామని అప్పుడు అందరూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని, జాతి ఐఖ్యత చాటాలని సూచించారు. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. రేపు అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని కెసిఆర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పాలు కూరగాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
దీనికి తెలంగాణా ప్రజలు అందరూ సహకరించి దేశానికి ఆదర్శంగా నిలవాలని కెసిఆర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఇది చాలా సీరియస్ వ్యవహారం కాబట్టి ప్రజలు ఎవరూ కూడా సరదా గా తీసుకోవద్దని అన్నారు. ప్రతీ ఒక్కరు కూడా మూడు మీటర్ల దూరం పాటించడమే మార్గం అని అన్నారు కెసిఆర్. పరిస్థితి ఉదృతం అయితే ప్రతీ ఇంటికి రేషన్ పంపిస్తామని అన్నారు.