కార్పొరేటర్ బిగ్ ట్విస్ట్… పోలీసులకి లొంగిపోయిన మంత్రి అనుచరుడు..!

-

భూ కబ్జాలు బెదిరింపులు వసూళ్ల ఆరోపణలు నేపథ్యంలో కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కార్పొరేట్ జంగిలి సాగర్ పోలీసులు ముందుకి వచ్చే లొంగి పోయాడు. పోలీసు శాఖ లో ఉన్న పరిచయాల తో కరీంనగర్ కి చెందిన ఒక పోలీస్ అధికారి ద్వారా మధ్యవర్తిత్వంలో పోలీసులకి లొంగిపోయినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గత నాలుగు రోజులుగా అజ్ఞాతం లోకి వెళ్లిన జంగిలి సాగర్ కోర్టుని ఆశ్రయిస్తున్నట్లు పుకార్లు బాగా వచ్చాయి.

కానీ సాగర్ మాత్రం తనకి ఉన్న పోలీస్ పరిచయాలు అలానే పోలీస్ అధికారులతో ఉన్న సానిహిత్య సంబంధం తో స్వయంగా లొంగిపోయి ఉన్నతాధికారులకి ట్విస్ట్ ఇచ్చాడు సాగర్ బాధితుల్లో మాత్రం ఆందోళన మొదలైంది గతం లో తన అధికార దర్పం తో పలు అరోపణలని కప్పిపుచి అక్రమాలకు పాల్పడ్డాడు పోలీస్ అధికారుల ద్వారా లొంగిపోవడం పై బాధితులు తమకు న్యాయం జరుగుతుందా అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు బయటికి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version