జూనియర్ ఎన్టీఆర్ భామ జాన్వి కపూర్ గురించి తెలియని వారు ఉండరు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన…. దేవర సినిమాతో జాన్వి కపూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు జాన్వీ కపూర్. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా జాన్వీ కపూర్ పెళ్లి పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇటీవలే ముగ్గురు పిల్లలను కంటానని చెప్పిన జాన్వీ కపూర్.. నాకు లాంగ్ హనీమూన్ కావాలి అంటూ ఆమె పేర్కొంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే నా పెళ్లి తిరుపతిలోనే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అతికొద్ది మంది సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని కూడా వివరించింది. పెళ్లి చేసుకున్న తర్వాత లాంగ్ హనీమూన్ వెళ్తానని.. పేర్కొనడం జరిగింది. దీంతో జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.