పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్సులు తగలబెట్టారు రైతులు. యూరియా టోకెన్లు ఇవ్వడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్సులు తగలబెట్టారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా టోకెన్లు ఇవ్వడంలేదని తమ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల జిరాక్సులు తగలబెట్టారు రైతులు.

రోజుల తరబడి యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని, నాట్లు వేసి చాలా రోజులు గడిచినా యూరియా బస్తాలు ఇవ్వడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు నేడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. రానున్న 10 రోజుల్లో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు విజ్ఞప్తి చేయనున్నారు తుమ్మల. ఇతర వ్యవసాయ మరియు ఉద్యాన సమస్యలపై సంబంధిత మంత్రులను కలవనున్నారు మంత్రి తుమ్మల.