నేడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. రానున్న 10 రోజుల్లో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు విజ్ఞప్తి చేయనున్నారు తుమ్మల. ఇతర వ్యవసాయ మరియు ఉద్యాన సమస్యలపై సంబంధిత మంత్రులను కలవనున్నారు మంత్రి తుమ్మల.

కాగా నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేసారు. మొన్న ఒక్కరోజే తెలంగాణకు 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిన్న మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని… సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వెల్లడించారు.