జనవరి 03 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

మార్గశిరమాసం- జనవరి- 3- ఆదివారం.

 

మేషరాశి:ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. మనసులో విచారం మాయం అవుతుంది.కుటుంబ సభ్యులతో ఉల్లసంగా గడుపుతారు. ఆఫీస్‌లో మీ పై అధికారులతో స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. మీ కోరికలను నెరవేర్చుకోగలరు. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు.  వివాదాలకు దూరంగా ఉండండి.

పరిహారాలుః శివారాధన మేలు చేస్తుంది.

 

todays horoscope

వృషభరాశి:ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.  ఈరోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. సమాజం పట్ల మీ భౌతిక దృక్పధం మారుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పనిని ఇష్టంగా చేయండి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. దేవాలయ సందర్శన చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్న పనులు  సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు.

పరిహారాలుః ఓం నమో భగవతే శ్రీవాసుదేవాయనమః అనే మంత్రాన్ని పారాయణం చేయండి.

 

మిథునరాశి:ఈరోజు వ్యాపారాలు కలిసివస్తాయి !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. మీ మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపదను పెంచుకుంటారు. ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. పెట్టుబడులు పెట్టడం వలన మీకు లాభాలు వస్తాయి.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.

 

కర్కాటకరాశి:ఈరోజు చేపట్టిన పనుల్లో అడ్డంకులు !

ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజు డబ్బు విషయంలో  సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు.  చేపట్టిన పనుల్లో అడ్డంకులు వస్తుంటాయి. మీరు ఈరోజు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు.

పరిహారాలుః శ్రీసూర్య ఆరాధన చేయండి.

 

సింహరాశి:శుభ వార్తలు వింటారు !

ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. మీ రంగంలో మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కొంత కష్టపడ్డా మీకు ఫలితం దక్కుతుంది. ఆస్తులు దక్కించుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం మీ ఆందోళనకు కారణమవుతుంది. పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త.

పరిహారాలుః శ్రీఆదిత్య పారాయణం చేయండి.

 

కన్యరాశి:ఉద్యోగ విషయంలో శుభవార్త !

ఆర్థికంగా అనుకూలం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు.  కార్యాలయంలో మీరు పేరుప్రతిష్టలు పొందుతారు. మీకు కెరీర్ లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారంలో సన్నిహితులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి.

పరిహారాలుః శ్రీపురుషసూక్త పారాయణం చేయండి.

 

 తులారాశి:ఈరోజు పనులను పూర్తి !

విజయం మీ స్వంతమవుతుంది.  వ్యాపారం , ఉద్యోగంలో మౌనంగా ఉండడం ఈరోజు మీకు కలిసొచ్చేలా చేస్తుంది. గొడవలను నివారిస్తుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.మీ సన్నిహితులు మీకు మద్దతు ఇస్తారు. ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు.

పరిహారాలుః శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు శుభ వార్త వింటారు !

ఈరోజు సంతృప్తి కరంగా ఉంటుంది. దూర ప్రదేశం నుంచి శుభ వార్త వింటారు.  మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భార్య పిల్లలతో సంతోషకరం సమయం గడుపుతారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.

 

ధనుస్సురాశి:ఈరోజు ఒత్తిడికి గురవుతారు !

ఈరోజు ఆనందంగా గడుస్తుంది. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు ప్రత్యేకమైన సహకారం అందుతుంది. ఈరోజు అన్ని రకాల వ్యాధుల నుంచి మీరు బయట పడగలుగుతారు. మీకు సంపద, ఉల్లాసం లభిస్తుంది. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

పరిహారాలుః శ్రీదుర్గాసూక్తపారాయణం చేయండి.

 

మకరరాశి:ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది !

ఈరోజు మీకు లాభ దాయకంగా ఉంటుంది. ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది. మీకు అకస్మాత్తుగా ఎక్కడ నుంచి అయినా సంపద లభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. ఈరోజు మీకు విజయం లభిస్తుంది. ఆర్థికంగా లాభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి.

 

కుంభరాశి:ఈరోజు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది !

ఈ రోజు వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది.  ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం పై దృష్టిని ఉంచండి. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. అనవసర గొడవల్లో తల దూర్చవద్దు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

 

మీనరాశి:ఈ రోజు అసౌకర్యంగా ఉంటుంది !

ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది.  ఈ రోజు మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది.  మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీకామాక్షి దేవి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version