జనవరి 28 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ జనవరి -28- గురువారం. పుష్యమాసం.

 

మేష రాశి:ఈరోజు ఉన్నత విద్యకు అర్హులవుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. వివాహాది సంబంధ విషయాలకు అనుకూలంగా  ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదివి కొన్ని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు, ఉన్నత విద్యకు అర్హులవుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ప్రయాణ సౌకర్యం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. తెలివిని సమయస్ఫూర్తిని ఉపయోగించి లౌక్యంగా  అందరితో పనులు చేయించుకోవడం చేసే అవకాశం ఉంది. పెద్ద వారితో సహనంగా ఉంటారు. సోదరులతో కలసి మెలసి ఉంటారు. ఉద్యోగస్తులు అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలను కలిగిస్తాయి. భార్యాభర్తలు సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా, ఏ పనిలో అయినా తొందరపడకుండా ఉండటం మంచిది. మాట జారి ఇతరులను కోప్పడటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారుల ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత కోల్పోతారు.

పరిహారాలుః దుర్గా దేవి ఆరాధన చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 కర్కాటక రాశి:ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంది అప్పుల బాధలు తీర్చుకొని ధన లాభం పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువులను తిరిగి పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:పిల్లల విషయంలో జాగ్రత్త !

ఈరోజు అనుకూలంగా లేదు. అతిగా మాట్లాడటం వల ఇబ్బందులు కలుగుతాయి. పరి హాస్యానికి దూరంగా ఉండడం మంచిది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, నష్టాలు జరుగుతాయి. స్త్రీలు ఒంటరిగా బయటికి వెళ్లకపోవడం మంచిది, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అదృష్ట యోగంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలో విజయం పొందుతారు. ఉద్యోగావకాశాలను పొందుతారు. మొండి బకాయిలు వసూలు చేసుకుని సమయానికి చేతికి డబ్బులు వచ్చి ధన లాభం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారాలు విస్తరించి లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:మిత్ర లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది.  అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఈరోజు మిత్ర లాభం పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. దంపతులిద్దరు సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:ఈరోజు కార్యసాధన పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులను ఎంత కష్టమైన సరైన సమయంలో పూర్తి చేసుకొని కార్యసాధన పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా, సఖ్యతగా ఉంటారు.

పరిహారాలుః లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:ఈరోజు ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేక మనోవేదన కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి ప్రశాంతత కోల్పోతారు. ఏ పని చేసిన అసహనంగా చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. భార్య భర్తల సమస్యలు వారిద్దరే పరిష్కరించుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద దృష్టి చూపడం మంచిది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించండి.

 

మకర రాశి:పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అన్నదమ్ములు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న స్థిరాస్తులను, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. పెద్దవారి పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. అప్పుల బాధ నుంచి బయటపడి ధన లాభం పొందుతారు. మీ మాట తీరు వల్ల అందరితో ఆదరణ పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి:గృహాన్ని కొనుగోలు చేస్తారు !

ఈరోజంతా ఆనందంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు  పెట్టడం వలన ధనయోగం పొందే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతుల అండుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని  గొప్ప పేరు పొందుతారు, కాలేజీల్లో సీటు పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు.

పరిహారాలుః ఈరోజు గురు, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 మీన రాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు వసూలు కాని కాని డబ్బులను తిరిగి వసూలు చేసుకుంటారు. సమయానికి ధన లాభం పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. మిత్ర లాభం పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ధన లాభం పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొంది ఉత్తమ విద్యార్థులుగా పేరుప్రఖ్యాతులు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు మీనాక్షి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version