Japan Teaser : జపాన్ టీజర్ వచ్చేసింది.. మళ్లీ అదరగొట్టిన కార్తీ

-

కంటెంట్ ఉన్న స్టోరీలతో తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటాడు కార్తీ. ఇటీవలే పొన్నియున్ సెల్వన్’, ‘సర్దార్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. పీఎస్ మిత్ర‌న్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ.. స‌ర్దార్ మూవీ స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ తో వచ్చాడు. జపాన్‌ అనే సినిమాను కార్తీ చేస్తున్నాడు.

Japan – Official Teaser

అయితే, రాజు మురుగన్ డైరెక్షన్ లో హీరో కార్తీ నటించిన యాక్షన్ త్రిల్లర్ మూవీ ‘జపాన్’ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. దొంగతనాల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో కార్తీక్ లుక్ వాయిస్ మాడ్యుయేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో సునీల్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. అను ఇమ్మాన్యూయల్ హీరోయిన్ గా నటిస్తుండగా, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. దీపావళికి మూవీ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version