సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డూ ప్రసాద వివాదం!

-

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా ల్యాబ్ రిపోర్ట్స్ రివీల్ చేయడంతో ఆ వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని భక్తులు జీర్ణించుకోకపోతున్నారు.ఇంతటి దారుణానికి పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రతిఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు పరిధిలో నిజానిజాలు బయటకు వస్తాయని సుబ్రమణ్య స్వామి తెలిపారు. కాగా,తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం మధ్యాహ్నం 2.15‌కు విచారణ చేపట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version