RECORDS: రూ. 900 కోట్ల క్లబ్ లో షారుఖ్ ఖాన్ జవాన్ !

-

తమిళ దర్శకుడు అట్లీ మరియు బాలీవుడ్ బాష్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి రిలీజ్ అయిన జవాన్ మూవీ… రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్ లను సాధించింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం జవాన్ మూవీ రూ. 900 కోట్ల క్లబ్ లోకి చేరుకొని రికార్డు సాధించింది. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 రోజులు కావస్తోంది. ఇప్పటికి సరిగ్గా రూ. 907 .54 కోట్లు వసూలు చేసింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 1000 కోట్లు క్లబ్ లోకి చేరిపోతుంది. ఇక షారుఖ్ ఖాన్ కు ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొదట్లో సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన పఠాన్ మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్ లను అందుకుంది.

ఇక ఇప్పుడు జవాన్ తోనూ రూ. 1000 కోట్లు అందుకుంటే, ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలను అందించిన ఘనత దక్కుతుంది. ఈ రికార్డును అందుకున్న తొలి హీరోగా చరిత్రలో నిలవనున్నారు షారుఖ్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version