64 ఏళ్ల వయసులో జయసుధ మళ్లీ పెళ్లి.. ఫోటోలు వైరల్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ మొదట్లో హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్రలకి పరిమితమైంది. ఆ తర్వాత కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె ఎక్కువగా క్యారక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే జయసుధకు సంబంధించిన పెళ్లి వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. నిజానికి జయసుధ మొదటి భర్త కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్త కొన్ని కారణాల వల్ల ఆమె నుంచి దూరమయ్యారు . ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహం చేసుకుంది. నితిన్ 2017 లో కొన్ని కారణాలవల్ల సూసైడ్ చేసుకొని మృతి చెందారు.

అప్పటినుంచి కొడుకుతో ఒంటరిగా నివాసం ఉంటున్న జయసుధ గత ఏడాది అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లి చికిత్స పొంది మళ్లీ ఇండియాకి వచ్చింది.గతంలో చికిత్స కారణంగా గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయిన జయసుధ ఇప్పుడిప్పుడే తన పూర్వ రూపాన్ని పొందే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం ఈమె ఒక బిజినెస్ మాన్ ను మూడో వివాహం చేసుకుందని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఏ ఈవెంట్లో, ఏ ఫంక్షన్ లో అయినా సరే జయసుధ అతనితోనే కలిసి కనిపిస్తోందట. దీంతో ఆమె అతడిని వివాహం చేసుకొని ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.

అంతేకాదు ఆలీ కూతురు ఫాతిమా పెళ్లిలో కూడా ఈ జంట సందడి చేసింది. అలాగే నిన్నటికీ నిన్న వరిసు ఈవెంట్లో కూడా జయసుధ అతనితోనే కలిసి వచ్చింది.అందుకే ఎవరికీ తెలియకుండా ఈ జంట వివాహం చేసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 64 సంవత్సరాల వయసులో జయసుధ మళ్ళీ పెళ్లి చేసుకుంది అంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version